మా తాతయ్య చెప్పిన స్నాన రహస్యాలు.
మా తాతయ్య అనగా మా అమ్మ తండ్రి పేరు కూడల రాజన్న. వారు మా ఊరికి దగ్గరగా ఉన్న సత్తెనపల్లి అనే గ్రామంలో పోలీస్ పటేల్ గా పని చేసేవారు. వారి స్వస్థలం జగిత్యాల దగ్గర ఉన్న జైన పేట. వారి వద్ద పూర్వకాలం నాటి అనేక పుస్తకాలు, గ్రంధాలు ఉండేవి .వారికి సాంప్రదాయిక విషయాలయందు పరిజ్ఞానం ఉండేది. నేను నా చిన్నతనంలో మా తాత గారి వద్ద చాలా రోజులు నేను ఉన్నాను. ఆ సమయంలో వారు నాకు చదువు నేర్పే వారు. వాటితో పాటు సాంప్రదాయక విషయాలు నేర్పేవారు. కానీ నాకు ఆ విషయాలలో ఉన్న గొప్పతనం అప్పుడు అర్థం కాలేదు.
ఇటీవల కాలంలో నేను స్నానం గురించి ఒక సైద్ధాంతిక ఆర్టికల్ ని ఆంగ్లంలో చదివినాను దాని ముఖ్య సారాంశం ఏమిటంటే బాత్రూంలో గుండెపోటులు అధికంగా వస్తున్నాయి. దానికి కారణం చల్లని నీటితో తల స్నానం చేయడమే అని చదివాను . మా తాతయ్య చెప్పిన విషయాలు నాకు స్మరణకు వచ్చాయి. మా తాతయ్య చెప్పిన రహస్యాల వలన ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చు. అంతేకాక ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు .వారు చెప్పిన విషయాలు;
వేడి నీటి స్నానం కన్నా బావి నీటి స్నానమే మంచిది. ఉదయం బావి నీరు గోరు వెచ్చగా ఉంటుంది. అందువల్ల ఆ నీరు తో స్నానం ఆరోగ్యానికి మంచిది. ప్రత్యేక పరిస్థితుల యందు నదీ స్నానం ఇంకా మంచిది. వారు మౌఖికంగా చెప్పకపోయినప్పటికీ దేవుని స్మరిస్తూ స్నానం చేసేవారు దానిని దేవ స్నానం అంటారు. దానివలన ఇంద్రియాలను నిగ్రహించే శక్తి వస్తుంది. వారు చెప్పిన మరో మాట స్నానం చేసేటప్పుడు నీళ్లను కాళ్ళ పైనుండి పోయటం ఆరంభించాలి, తరవాత వెన్నుపై పోసిన అనంతరం చాతి భాగాలని తడపాలి. దానివలన చలి గా అనిపించదు. స్నానం చివరిదశలో మాత్రమే ముఖంపై నీరు పోయాలి. చల్లగా ఉన్న నీటితో తల స్నానం చేయరాదు. ఒకవేళ నీటిని తలపై నుండి పోయటం ఆరంభిస్తే వారు కోపించే వారు. వారి కారణంగానే నాకు వారు చెప్పిన పద్ధతిలో స్నానం చేసే విధానం అలవాటుగా మారింది.
పైన చెప్పిన విషయాలు చాలా చిన్న విషయాలుగా మనకు అనిపిస్తాయి కానీ అందులో ఎంతో శాస్త్రీయత ఉంది. నేరుగా చల్లని నీరు తలపై పడటం వల్ల చలి బారి నుంచి రక్షించుకోవటానికి శరీరం రక్తం మరియు ఆక్సిజన్ అంతా తల ప్రాంతంలో కేంద్రీకృతం కావడానికి గుండె వేగంగా పని చేయాల్సిన ఆవశ్యకత వస్తుంది. దీని ద్వారా గుండె వేగంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్పు వస్తుంది ఇది గుండెపోటుకు దారితీస్తుంది.
అందువల్లనే బాత్రూంలో గుండె పోట్లు అధికంగా వస్తున్నాయి. మన పూర్వీకులకు చల్లని నీటితో తలస్నానం చేయటం అనారోగ్యకరమని తెలుసు. పై విషయాలన్నీ ఆంగ్లంలో నేను చదివిన వ్యాసం నందు పొందుపరచబడ్డాయి. కావున వారిని గుర్తుకుతెచ్చుకుంటూ నేను ఈ స్నాన రహస్యాల గురించి మీకు చెప్పుటకు తెలుగులో ఈ వ్యాసం రాస్తున్నాను.
కావున చల్లని నీటితో తలస్నానం ని నివారించండి .ప్రత్యేకంగా షవర్ బాత్ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండండి .చలికాలంలో నిలువ ఉన్న నీరు మరింత హాని కలిగిస్తుంది .
మరో విషయం, మన పూర్వీకులు చేతులను కూడా తలపై పెట్టుకొని ఇచ్చేవారు కాదు చేతుల పై ఉన్న విద్యుదావేశం తలపై కొంత ప్రభావాన్ని చూపుతుందని వారి విశ్వాసం .
పండుగల సమయంలో శరీరం మొత్తాన్ని నువ్వుల నూనెతో మర్ధన చేయించేవారు. దీనివలన శరీరమందలి ఎముకలు దృఢంగా మారడమే కాక చర్మాన్ని కూడా కాంతివంతం చేస్తుంది.
వివిధ వనమూలికలతో కూడినటువంటి పొడులను తలకు రుద్దే వారు. దీనివలన తల సుగంధ భరితం అగుటయే కాక శరీరం లో ఉన్నటువంటి వేడి తగ్గేది ఈ మూలికల్లో అధిక భాగం వట్టివేరు ఉండేది తల శుభ్రం కావడానికి వీలుగా కొంత శీకాయ పొడి ఉండేది. ఆ రకంగా వన మూలికలు ఉపయోగించటం వారి జీవన విధానంలో భాగంగా ఉండేది. దానివలన వారి యొక్క ఆయు ప్రమాణం అధికంగా ఉండేది 60 సంవత్సరాల వయసు లో కూడా చక్కగా వారి పనులను వారే చేసుకునేవారు.
కావున స్నానం చేసేటప్పుడు పై విషయాలను గమనిస్తూ స్నానం చేస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి.
Latest Posts
- » Support Prohibition of Child Marriage (Amendment) Bill, 2021.
- » Tree hugging : oxygen levels increase
- » Call to #GiveUp food security cards
- » International affairs: Vision 2040
- » Lack of Punctuality in meetings
- » Establish Secular Nations
- » Samsung India, decrease prices
- » Support Weavers
- » Impact of long meetings
- » Sudarshana Chakra