I used to play table tennis(T.T) during my adolescent days in the club existing in our native Khanapur. Many of our seniors also played there.
I used to continuously play T.T.on most of the days. I was physically very fit.
On one day, while i was playing with one of my seniors, a super senior joined us and wanted to play with the senior. But, senior asked the super senior to play with me. He commented that how to play with bachha in anger. Super senior continued his attitude even after getting the information that i play well.It caused annoyance to me. But, i decided to speak in action.
At that time the total number of points to win was 21.services in each turn was 5. I have firmly decided to beat him under 5.
I played very ferociously. I had not given him a chance, except his 5th and last point.I won it with clear advantage of under 5 win. Finally, he repented for his comments and said well played.
I always draw an inspiration from this incident to speak in actions instead of words.Exchange the words is mere waste of time. Speak with your actions.It increases your power.
మన చేతల్ని /చర్యల్ని మాట్లానిడద్దాం:
నేను బాలునిగా ఉన్నప్పటి నుండి మా స్వస్థలం ఖానాపూర్లో ఉన్న ఒక క్లబ్ లో టేబుల్ టెన్నిస్ ఆడే వాడిని. నా సీనియర్లు కూడా చాలా మంది అక్కడ ఆడేవారు. నేను రోజుల తరబడి నిరంతరంగా టేబుల్ టెన్నిస్ ఆడే వాడిని. నేను శారీరకంగా చాలా ఫిట్ గా ఉండేవాడిని. ఒక రోజు నా సీనియర్ తో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నప్పుడు మా సీనియర్ కి సీనియర్ (సూపర్ సీనియర్) వచ్చి, మా సీనియర్ తో ఆడతాను అన్నాడు. అప్పుడు మా సీనియర్ నన్ను చూపిస్తూ తనతో ఆడమని సీనియర్ కి చెప్పాడు. అప్పుడు ఆ సూపర్ సీనియర్ కోపంతో ఈ బచ్చగాడితో ఎలా ఎలా ఆడడం అంటూ హేళన గా మాట్లాడాడు.
తర్వాత తనకు నేను బాగా ఆడతానని తెలిసిన కూడా అదే విధంగా హేళనగా మాట్లాడటం నన్ను చాలా బాధించింది. అప్పుడే అనుకున్నా నేను నా చేతలతో మాట్లాడాలని. ఆ సమయంలో టేబుల్ టెన్నిస్ గెలవడానికి మొత్తం పాయింట్లు 21. ఒక టర్న్ కి 5 సర్వీసులు ఉంటాయి. నేను దృఢంగా నిశ్చయించుకున్నాను, అతని ఐదు పాయింట్లలోపే ఓడించాలని. నేను భయంకరంగా ఆడాను. తనకి తన ఐదవ, చివరి పాయింట్లు తప్ప నేను ఎక్కడ అతనికి అవకాశం ఇవ్వకుండా ఆడాను. అతన్ని
చిత్తుగా ఓడించి గెలిచాను. చివరికి తను తన మాటలకి పశ్చాత్తాపపడుతూ, బాగా ఆడావని అన్నాడు. నేను ఎప్పుడూ ఆ సంఘటన నుంచి ప్రేరణ పొందుతూనే ఉంటాను. మాటల్లో కాదు చేతల్లో మాట్లాడాలని, మాటల యుద్ధం తో తో కేవలం సమయం వృధా మాత్రమే అని తెలుసుకున్నాను. చేతలతో మాట్లాడు, అది మీ శక్తిని పెంచుతుంది.