ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య
విటమిన్ డి లోపం వల్ల ఎదురయ్యే మధు మేహం. విటమిను-డి సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలొహిత కిరణాల వల్ల శరీరంలో ఉత్పత్తి అవుతుంది.
దీనికి సంబంధించిన కారణాలను విశ్లేషణ చేద్దాం, పరిష్కార మార్గాలను తెలుసుకుంటారు .
1. మన పూర్వీకులు సూర్య రశ్మిలో విటమిను డి అధికం గా ఉండే ఉదయ కాలం లో ఆరుబయట తిరగె వారు. మనం ఉదయం లేవడం లేదు, లేచినా తిరగటం లేదు.
పరిష్కార మార్గం : ఆదిత్య కిరణాల సమయంలో గ్రౌండ్ లో నడుద్దాం. వీలు చూసుకుని కనీసం 9 గంటల సమయం కన్నా ముందు నడుద్దాం.
2. పూర్వం నది స్నానం చెసే వారు, అందుకని సూర్యోదయానికి ముందు లేచి నడిచి వెల్లె వారు. ఉష: కిరణాలలో వ్యాధి నిరోధక లక్షణాలు ఉన్నాయి. మనము ఇంటి నుంచి బయటకి వెల్లట్లెదు.
పరిష్కార మార్గం: కనీసం నది దగ్గర ఉన్న వారు వారం లో ఒక రోజు ఐనా నదిలో స్నానం చేయండి. లేదా ఆరు బయట ఐనా చేయండి.
3. వాహనాలలో వెల్లెటపుడు ఎయిర్ కండిషన్, గదిలో కూడా వాడుచున్నారు. చలిని తట్టుకునేందుకు శరీరం కాల్షియం మరియు విటమిను డి వాడుకుంటున్నది. దాని వలన లోపం పెరుగుతుంది. అంతే కాక సూర్య కాంతి శరీరానికి తగలకుండా కూడా ఆపుతుంది.
పరిష్కార మార్గం: ఎయిర్ కండిషన్ వాడకం తగ్గించాలి లేదా పూర్తిగా మానెయ్యాలి.
4. వాహనాల లో వెల్లెటపుడు కాలుష్యం వల్ల అద్దాలు వేస్తారు. దీని వల్ల అతి నీల లొహిత కిరణాలూ శరీరానికి తాకవూ.
పరిష్కార మార్గం: తక్కువ దూరాలకు సైకిల్ లేదా బైక్ పై వెల్లండి. కారు లో వెళ్ళేటప్పుడు గ్లాసులు దించి సూర్య కాంతిని, గాలిని ఆస్వాడించండి.
5. కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల అతి నీల లొహిత కిరణాలు మన లను చేరడం లేదు.
పరిష్కార మార్గం: మీ వూర్లో కాలుష్యం తగ్గడానికీ మార్గాన్ని ఆలోచించండి, అమలు చేయండి. చెట్లు పెంచడం, రక్షించటం, వనరుల సంరక్షణ, సామాన్య జీవితం గడపడం, ఇంకా చెప్పాలంటే మరెన్నో.
If you care for the health of the people, share it to other groups and individuals .
Srinivas Bonagiri,
Municipal Commissioner.