శరీర ఆక్సీజన్ పెరుగుదల- చెట్టును కౌగిలించుకోవడం
కరోనా నేపథ్యంలో చాలా మంది శరీర ఆక్సీజన్ తగ్గడం మనం గమనిస్తున్న నేపథ్యంలో జపాన్ వారు అనుసరించే చెట్టును కౌగలించుకొనే పద్దతి దాని లాభాలు, ఇతర మార్గాలు తెలియజేస్తాను.
మనకు ఆక్సీజన్ ఇచ్చే ఒకే ఒక్క సోర్స్ చెట్లు. కొన్ని చెట్లు శరీరంలో ప్రాణ శక్తి ప్రవాహం కూడా పెంచుతాయి. వేప, రావి వంటి పంచ వృక్షాలు,ఔషధ మొక్కలు, చెట్లు అత్యధిక మొత్తం ఆక్సీజన్ విడుదల చేస్తాయి. వీటి నుండి విడుదల అయ్యే గాలి వల్ల కూడా అనేక వ్యాధులు నయం అవుతాయి.
జపాన్ దేశంలో శరీర ఆక్సీజన్ మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం 10 నుండి 15 నిమిషాల వరకు శరీరం మొత్తం తగిలేట్లు కౌగిలించుకుని ఉంటారు. వారి యొక్క సగటు ఆయుర్దాయం ఎక్కువ ఉండటానికి ఇదొక కారణం.
మన దేశంలో కూడా చెట్లను పూజించడం, ప్రదక్షిణలు చేయడం , వాటి క్రింద ధ్యానం చేయడం వంటి పనులు చేస్తారు. ప్రకృతిలో గడపడం కోసం అడవి దేవతల ను ఆరాధన పేరుతో 2,3 రోజులు అడవి లో గడిపి శరీర ఆక్సీజన్ మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటారు. ఇవి మన సాంప్రదాయం లో భాగంగా ఉన్న వీటిని విస్మరిస్తే జరుగుతున్న అనర్థాలు అనేకం.
చెట్ల కౌగలింతకు అనుకూలంగా ఉండే చెట్లు వేప మరియు రావి. నేను కూడా ఈ పద్ధతి అనేక సంవత్సరాలుగా అవలంబిస్తున్నాను. ఈ సమయంలో శ్వాస పై ధ్యాస ఉంచడం వలన మంచి ఫలితాలను పొంద వచ్చు.
వేప మరియు రావి కలిసి ఉన్న చోట ధ్యానము లేదా ప్రాణాయామం చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అతి ఎక్కువ ప్రాణ శక్తి ఉన్న చెట్ల లో వెదురు ఒకటి.
మన ఇంటి పరిసరాల్లో ఒక వేప వంటి చెట్టు ఉంటే మన రోగ నిరోధక శక్తి, ఆయుష్షు పెరుగుతాయి అనేది నిర్వివాదాంశం.
పళ్ళు, పచ్చి కూరగాయలు, గింజలు , ఆకులు తినడం వల్ల కూడా శరీర ఆక్సీజన్ స్థాయిలు పెరుగుతాయి.
శరీరంలో ఉండే impurities విసర్జించడం వల్ల కూడా ఆక్సీజన్ శాతం పెరుగుతుంది.
సాష్టాంగ నమస్కారం చేయడం, భుజంగాసనం వల్ల కూడా ఆక్సీజన్ శాతం పెరుగుతున్నదని యోగ నిపుణులు అంటున్నారు. ప్రాణాయామం లో పూరకం లో ఉన్నపుడు (ఆక్సీ మీటర్ రీడింగ్ పెరగడం ) ఆక్సీజన్ స్థాయిలో పెరుగుదల స్వయంగా గమనించాను.
కరక్కాయ శరీర వ్యవస్థను అనులోమ స్థితిలో ఉంచి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా శ్వాస కోశ వ్యాధుల్లో అద్భుత ఔషధం. అడ్డసరము ఆకు కూడా శ్వాస కోశ వ్యాధులలో అద్భుత ఔషధం.
కావున, మీకు అనుకూల పద్ధతి పాటించి ఆక్సీజన్ స్థాయి, రోగ నిరోధక శక్తి పెంచుకొని, ధైర్యంగా ఉంది కరోనాను జయించాలి అని ప్రార్థన. ఈ పద్ధతి పాటించి వ్యాధి రాకుండా కూడా చూసుకోవచ్చు.
Srinivas Bonagiri,
Municipal Commissioner.
Increase in body oxygen- Embrace the tree
In the light of the fact that many people in the background of the corona are depleted of oxygen in the body, I will tell you about the benefits of the method of embracing the tree that Japan follows, and other ways.
Trees are the only source of oxygen for us. Some trees also increase the flow of vital energy in the body. Pancha trees like Neem and Ravi, medicinal plants and trees release the highest amount of oxygen. The air released from these can also cure many diseases.
In Japan, a full body of oxygen is used for 10 to 15 minutes to enhance the body’s oxygen and immunity. This is one of the reasons why their average life expectancy is so high.
Even in our country, people do things like worshiping trees, doing circumambulations and meditating under them. Spend 2,3 days in the jungle in the name of worshiping the forest deities to spend time in nature and boost the body’s oxygen and immunity. There are many misfortunes that can happen if we ignore these which are part of our tradition.
The trees that are suitable for the embrace of trees are neem and pipal. I have also been adopting this method for many years. Concentrating on breathing during this time can get better results.
Meditation or pranayama where neem and ravi are together can also get amazing results. Bamboo is one of the most vital trees.
It is undeniable that having a neem-like tree around our home will increase our immunity and longevity.
Eating fruits, vegetables, nuts and leaves can also increase oxygen levels in the body.
Excretion of impurities in the body also increases the percentage of oxygen.
Yoga experts say that the percentage of oxygen is also increased due to prostration and shoulder posture. I noticed an increase in the oxygen level itself during the pooraka stage (increase in oxymeter reading) during pranayama.
Karakkaya not only keeps the body system in check but also boosts the immune system and is a wonderful medicine in respiratory diseases. Addasaram leaf is also a wonderful medicine in respiratory diseases.
So, pray that you follow the positive method, increase the oxygen level, increase immunity and conquer the corona by staying brave. These methods can also be used to prevent disease.
Srinivas Bonagiri,
Municipal Commissioner.